అండమాన్ నికోబార్ దీవుల్లో భూ ప్రకంపనలు..పరుగులు తీసిన జనం

అండమాన్ నికోబార్ దీవుల్లో భూ ప్రకంపనలు..పరుగులు తీసిన జనం

వరుస భూకంపాలతో అండమాన్ నికోబార్ దీవులు వణికిపోతున్నాయి. ఏప్రిల్ 9వతేదీ ఆదివారం మధ్యాహ్నం అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది. 2: 59 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.1తీవ్రతగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే భూకంపంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది.  భూకంపం 10 కి.మీ లోతులో ఏర్పడినట్లు వెల్లడించింది. భారీ భూ ప్రకంపనాలతో జనం పరుగులు తీశారు. 

https://twitter.com/NCS_Earthquake/status/1645006905125814272

అండమాన్, నికోబార్ దీవుల్లో భూమి కంపించడం వారంలో ఇది రెండోసారి. ఏప్రిల్ 6 న కూడా అండమాన్ మరియు నికోబార్ దీవులలో భూకంపం సంభవించింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతగా నమోదైంది. పోర్ట్ బ్లెయిర్‌కు 140 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించింది. ఈ  భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.