లైగ‌ర్ బ్యూటీ స్పెషల్ సర్ప్రైజ్..ప్రియుడా..స్నేహితుడా!

లైగ‌ర్ బ్యూటీ స్పెషల్ సర్ప్రైజ్..ప్రియుడా..స్నేహితుడా!

బాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రేమాయణాలు జరపడంలో ముందుంటారు.అలా అని తెలుగులో లేరని కాదు. చూసుకుంటే ఎవ్వరూ తక్కువేం కాదు. అసలు విషయానికి వస్తే.. బాలీవుడ్ యంగ్ హీరో అదిత్యారాయ్ క‌పూర్-లైగర్ బ్యూటీ అనన్య పాండే (Ananyapandey) మధ్య ఉన్న రిలేష‌న్ షిప్ గురుంచి బాలీవుడ్ మీడియాలో వరుస  క‌థ‌నాలు వెడెక్కిస్తోన్న సంగ‌తి అందరికీ తెలిసిందే. 

వీరిద్దరూ అందరి కళ్ళు కప్పి విదేశీ ట్రిప్స్ కు..చాటు మాటు పార్టీస్ కు వెళ్ళే ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. రీసెంట్ గా మాల్దివ్ వెకేషన్ ఫోటోలు ఓ వర్గం నెటిజన్స్ కి భారీ ఎత్తున కిక్ ఇచ్చాయంటే నమ్మరు సుమా!. కానీ ఈ రూమర్స్ గురుంచి మాత్రం  లైగర్ బేబీ అన‌న్య త‌మ మ‌ధ్య కేవ‌లం స్నేహం త‌ప్ప ఇంకెలాంటి రిలేష‌న్ షిప్ లేదనీ చెప్తుంది. ఇక దీనిపై హీరో అదిత్య క‌పూర్ మాత్రం ఎలాంటి వివ‌ర‌ణ ఇంతవరకు ఇవ్వ‌లేదు.

లేటెస్ట్ గా ఆదిత్య‌రాయ్ క‌పూర్ బర్త్ డే సంద‌ర్భంగా అనన్య స్పెషల్ విషెస్ తో ఓ ఫోటోని పోస్ట్ చేసి అందరినీ స‌ర్ ప్రైజ్ చేసింది.ఆ ఫోటోకి ట్యాగ్ ఇస్తూ..హ్యాపీ బ‌ర్త్ డే ఏడి అంటూ రాసుకొచ్చింది. 

ఇక ఈ ఒక్క ఫోటోతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది నెటిజన్స్ కు తెలిసిపోయింది. ప్ర‌స్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీంతో ఫ్యాన్స్  ఆ జోడీకి విషెస్ తెలియ‌జేస్తున్నారు. అనన్య ప్ర‌స్తుతం బాలీవుడ్ మూవీస్ లో రాణిస్తుంది. ఇక ఆదిత్య రాయ్ ప్ర‌స్తుతం `మెట్రో ఇన్` అనే సినిమా చేస్తున్నాడు. ఇది ఆన్ సెట్స్ లో ఉన్నట్టు సమాచారం. ఇక ఈ లవ్ బర్డ్స్ కూడా తొందరలో పెదవి విప్పే అవకాశం కనిపిస్తోంది. .

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ananya ?? (@ananyapanday)

  • Beta
Beta feature