ఛత్తీస్‌గఢ్‌లో కాటు వేసిందని.. ఆ పామునే కొరికి చంపేసిండు

ఛత్తీస్‌గఢ్‌లో కాటు వేసిందని.. ఆ పామునే కొరికి చంపేసిండు

పాము కరిచిందన్న కోపంతో ఓ బాలుడు ఆ పామునే కొరికి చంపేశాడు. ఈ ఘటన  ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్‌ జిల్లా పంద్రపుత్‌ గ్రామం పహాఢీ కోర్వాలో జరిగింది. దీపక్‌ రామ్‌ అనే పన్నెండేళ్ల బాలుడు తమ నివాసానికి దగ్గర్లో ఉన్న సోదరి ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఓ పాము అతని చేతిపై కాటు వేసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన దీపక్‌ పారిపోతున్న పామును వెంబడించి మరీ చేజిక్కించుకున్నాడు. వెంటనే గట్టిగా ఆ పామును కొరికేశాడు. ఈ విషయం తెలియడంతో దీపక్‌ను అతని సోదరి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. దాంతో ఆ బాలుడికి ప్రాణాపాయం తప్పింది. కానీ ఆ బాలుడు కొరకడంతో పాము మాత్రం మరణించింది.

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాను సాధారణంగా నాగలోక్ అని కూడా పిలుస్తారట. ఎందుకంటే ఇక్కడ అత్యంత విషపూరితమైన నాగుపాములు నివసిస్తాయని సమాచారం. ఇక్కడ ఉన్న గుహ ద్వారా నాగలోకానికి వెళ్లవచ్చని పురాణాలు చెప్తున్నాయట. అంతే కాదు ఇక్కడ70 కంటే ఎక్కువ రకాల పాములు కనిపిస్తాయట. ఛత్తీస్‌గఢ్‌లో కనిపించే అన్ని రకాల పాముల్లో 80 శాతం ఒక్క జష్‌పూర్‌లోనే ఉన్నాయని పలువురి అభిప్రాయం.