బంగాళాఖాతంలో జూలై 28న మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో జూలై 28న మరో అల్పపీడనం

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ లేటెస్టుగా మరో నివేదిక విడుదల చేసింది. ఈ నెల 28న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటి రెండు రోజు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వివరించింది. తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఆగస్టు 3 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.