మరో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యాయత్నం

మరో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు ఉద్ధృతమవుతోంది. ఇప్పటికే ఇద్దరు ఈ ఉద్యమం కోసం ఆత్మబలిదానం చేశారు. తాజాగా  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపో ముందు మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. యూసఫ్‌గూడకు చెందిన కండక్టర్ జి.సందీప్‌  బ్లేడుతో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు, పోలీసులు ఆయన్ను అడ్డుకుని కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సందీప్ పరిస్థితి విషమంగా ఉంది.