బాలీవుడ్ సీనియర్ నటి, రచయిత లలిత లాజ్మి కన్నుమూత

బాలీవుడ్ సీనియర్ నటి, రచయిత లలిత లాజ్మి కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ సీనియర్ నటి, ప్రముఖ పెయింటర్, రచయిత లలిత లాజ్మి (90) కన్ను మూశారు. కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, సోమవారం రాత్రి ఇంట్లోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లలిత లాజ్మీ బాలీవుడ్ లెజండరీ హీరో గురుదత్ సోదరి. హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించిన లలిత... తారే జమీన్ పర్ సినిమాలో ఆర్ట్ టీచర్‌‌గా కనిపించారు.

లలిత చిత్రలేఖనంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దేశంలో ప్రసిద్ధ కళాకారుల్లో ఒకరిగా ఎదిగారు. తాను వేసిన పెయింటింగ్స్‌ అంతర్జాతీయ ఆర్ట్ గ్యాలరీల్లో ఎగ్జిబిట్ చేశారు. సెల్ఫ్ థాట్ ఆర్టిస్టైన లలిత లాజ్మీ అనేక కూడా రచనలు చేశారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.