వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు పెట్టండి

వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు పెట్టండి
  • రైల్వే శాఖకు లెటర్‌‌ రాసిన
  • మహారాష్ట్ర డిప్యూటీ సీఎం

ముంబై: మహారాష్ట్రలోని వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌‌ రైల్వే శాఖను కోరారు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆయన గురువారం లెటర్‌‌ రాశారు. మే 3 లాక్‌డౌన్‌ అయిపోగానే షెల్టర్‌‌ హోమ్స్‌లో ఉన్న కార్మికులంతా ఒక్కసారిగా రోడ్లపైకి వస్తారని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుందని పవార్‌‌ చెప్పారు. ఫస్ట్‌ ఫేజ్‌ లాక్‌డౌన్‌ పూర్తైన తర్వాత ముంబైలోని బాంద్రా వచ్చిన పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అన్నారు. “ వలస కూలీల కోసం ముంబై, పుణేల నుంచి ప్రభుత్వం ముందుగానే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలి’’ అని అజిత్‌పవార్‌‌ ఆ లెటర్‌‌లో అన్నారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఈ నెల 14న మోడీ ప్రకటించిన వెంటనే ముంబైలోని బాంద్రాకు దగ్గర్లో ఉంటున్న కూలీలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. తమ ఊళ్లకు పంపాలంటూ వాళ్లంతా ఆందోళనకు దిగారు. ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్‌ చేయాల్సి వచ్చింది.