కేసీఆర్ నిరంకుశ పాలన చేస్తున్నారు: ఆర్టీసీ జేఏసీ కన్వినర్

కేసీఆర్ నిరంకుశ పాలన చేస్తున్నారు: ఆర్టీసీ జేఏసీ కన్వినర్

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు సరికాదరి అన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వథ్థామ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన… కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొత్త వారిని ఆర్టీసీలోకి కేసీఆర్ తీసుకోవాలనుకుంటున్నారని.. వారితో సమ్మెలో పాల్గొనబోమని రాయించుకోవడానికి చూస్తున్నారని ఆయన అన్నారు. తన పార్టీలో జాయిన్ అయిన వారిని కూడా భవిష్యత్తులో వేరే పార్టీలోకి వెళ్లోద్దని కేసీఆర్ రాయించుకుంటాడా అని అశ్వథ్థామ రెడ్డి  ప్రశ్నించారు. నిరంకుశపాలన వల్లనే ఎంపీ ఎలక్షన్స్ లో తొమ్మిది సీట్లకే టీఆర్ఎస్ పరిమితమైందని అన్నారు.

తమ భుజాలపై ఆర్టీసీని మోశామని అన్నారు అశ్వధ్ధామ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడు ఆర్టీసీని డెవలప్ చేశామని చెప్పారు. అప్పటికంటే ఇప్పుడు సగటున ప్రతీ సంవత్సరం ఏడు లక్షల మంది ప్రయాణీకులు పెరిగారని చెప్పారు. ఇది ఆర్టీసీ కార్మికుల శ్రమేనని ఆయన చెప్పారు.