15 ఏళ్లప్పుడు నా ఫొటో అడల్ట్ సైట్స్లో పెట్టారు.. అందుకే ఇంట్లో నుంచి పారిపోయా 

15 ఏళ్లప్పుడు నా ఫొటో అడల్ట్ సైట్స్లో పెట్టారు.. అందుకే ఇంట్లో నుంచి పారిపోయా 

వివాదాలకు కేరాఫ్ అయిన బాలీవుడ్ బ్యూటీ, సెన్సేషనల్ మోడల్ ఉర్ఫీ జావెద్ సంచలన విషయాలు బయటపెట్టింది. తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన క్షణాలను వెల్లడించింది. తన తల్లిదండ్రుల నుంచి ఎదురైన గడ్డు పరిస్థితులను వివరించింది. ఉర్ఫీ జావెద్ కు 15 ఏళ్ల వయసున్నప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫొటోను అడల్ట్ సైట్స్ లో అప్లోడ్ చేశారు.

అది తెలుసుకున్న తన తండ్రి నిజాన్ని నమ్మకుండా.. తనను కొట్టారని తెలిపింది. ఉర్ఫీ జావెద్ ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసిన ఫొటోను మార్ఫింగ్ చేసి ఎవరో అడల్ట్ సైట్ లో పెట్టారు. అది తెలిసి.. తన తప్పు లేకపోయినా ఉర్ఫి వాళ్ల నాన్న దారుణంగా కొట్టాడు.

ఈ సాకుతో చుట్టాల దగ్గర సింపతీ పొందేందుకు.. పోర్న్ సైట్ వాళ్లు రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నారంటూ బంధువులు దగ్గర సానుభూతి పొందేవాడని ఉర్ఫి చెప్పుకొచ్చింది. ఆ అభియోగాలు మోస్తూనే ఉర్ఫి.. రెండేళ్లు నరకం అనుభవించింది. తన 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి సొంత కాళ్లపై నిలబడింది.