జాతీయ స్ఫూర్తిగా ఆత్మనిర్భర్ క్యాంపెయిన్

జాతీయ స్ఫూర్తిగా ఆత్మనిర్భర్ క్యాంపెయిన్

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ క్యాంపెయిన్ ప్రభుత్వ విధానం మాత్రమే కాదని ఇది జాతీయ స్ఫూర్తి అని ప్రధాని మోడీ అన్నారు. నెలవారీ రేడియో కార్యక్రమంలో మన్ కీ బాత్‌‌లో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌‌ ప్రాధాన్యతతోపాటు దేశ శాస్త్రవేత్తలు, క్రీడల్లో ప్రాంతీయ భాషల కామెంటరీ గురించి ఆయన మాట్లాడారు. దేశీ సైంటిస్టుల సేవలను గుర్తించాలని ప్రజలను కోరారు. ప్రాంతీయ భాషల్లో స్పోర్ట్స్ కామెంటరీకి ప్రాధాన్యత ఇవ్వాలని.. తద్వారా క్రీడలకు మరింత గుర్తింపును తీసుకురావాలన్నారు.

‘ఆత్మనిర్భర్ భారత్ ప్రభుత్వ పాలసీ మాత్రమే కాదు. ఇది జాతీయ స్ఫూర్తి. నేడు సాధారణ ప్రజానీయం గుండెల్లో ఓ సెంటిమెంట్‌‌గా ఆత్మనిర్భర్ భారత్ మారింది. సాధారణ వ్యక్తులు అసాధారణ పనులు చేస్తూ చాలా విషయాల్లో మన దేశాన్ని ఇతర కంట్రీస్ మీద ఆధారపడకుండా చేయడాన్ని చూస్తున్నాం’ అని మోడీ పేర్కొన్నారు. తమిళ భాషను మోడీ ప్రశంసించారు. ప్రపంచంలో అతి ప్రాచీన భాష తమిళం అని, అది అందమైన ల్యాంగ్వేజ్ అని కొనియాడారు. తమిళ సాహిత్యం, కవిత్వం గురించి విని ఆశ్చర్యపోయానని.. తమిళం నేర్చుకోనుందుకు తనకు బాధగా ఉందన్నారు.