వార్నర్‌‌‌‌ ధనాధన్‌‌‌‌: లంకపై ఆసీస్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ

వార్నర్‌‌‌‌ ధనాధన్‌‌‌‌: లంకపై ఆసీస్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ

దుబాయ్‌‌‌‌‌‌‌‌: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌తో పాటు వామప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఫెయిలై విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా స్టార్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌ వార్నర్‌‌‌‌‌‌‌‌ (42 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లతో 65) ఎట్టకేలకు ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. తనలోని హిట్టర్‌‌‌‌‌‌‌‌ను నిద్రలేపిన ఈ డేంజర్‌‌‌‌‌‌‌‌ మ్యాన్‌‌‌‌‌‌‌‌ ధనాధన్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో  శ్రీలంక బౌలర్లపై రెచ్చిపోయాడు. దాంతో,  టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం అందుకుంది. సూపర్‌‌‌‌‌‌‌‌12, గ్రూప్‌‌‌‌‌‌‌‌1లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఏకపక్ష మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  తొలుత  శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. కుశాల్‌‌‌‌‌‌‌‌ పెరీరా (35), చరిత్‌‌‌‌‌‌‌‌ అసలంక (35), భానుక రాజపక్స (33 నాటౌట్‌‌‌‌‌‌‌‌) రాణించారు. ఆసీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో ఆడమ్‌‌‌‌‌‌‌‌ జంపా (2/12), స్టార్క్‌‌‌‌‌‌‌‌ (2/27), కమిన్స్‌‌‌‌‌‌‌‌ (2/34) రెండేసి వికెట్లు తీశారు. తర్వాత వార్నర్​ మెరుపులతో కంగారూ టీమ్‌‌‌‌‌‌‌‌ 17 ఓవర్లలోనే 155/3  స్కోరు చేసి గెలిచింది. ఫించ్‌‌‌‌‌‌‌‌ (37), స్మిత్‌‌‌‌‌‌‌‌ (28 నాటౌట్), స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ (16 నాటౌట్‌‌‌‌‌‌‌‌) కూడా రాణించారు. పొదుపుగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన జంపాకు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు దక్కింది.
వార్నర్‌‌‌‌‌‌‌‌ జోరు
తన చివరి ఐదు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో కలిపి 17 రన్సే చేసిన వార్నర్‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో టచ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. ఆసీస్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ఆరోన్‌‌‌‌‌‌‌‌ ఫించ్‌‌‌‌‌‌‌‌తో కలిసి స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో  ఫించ్‌‌‌‌‌‌‌‌ కూడా దూకుడుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. లాహిరు కుమార వేసిన నాలుగో ఓవర్లో ఫించ్‌‌‌‌‌‌‌‌ 4, 6.. వార్నర్‌‌‌‌‌‌‌‌ 4, 4తో 20 రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టారు. ఆపై చమీర బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఫించ్‌‌‌‌‌‌‌‌ 6, 4 కొట్టడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలోనే ఆసీస్‌‌‌‌‌‌‌‌ 63/0 స్కోరు చేసింది. ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ రిస్ట్రిక్షన్స్‌‌‌‌‌‌‌‌ మారిన తర్వాత స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ వానిందు  హసరంగ వరుస ఓవర్లలో ఫించ్‌‌‌‌‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ (5)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి లంకను రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, వార్నర్‌‌‌‌‌‌‌‌ ఆ చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. స్మిత్‌‌‌‌‌‌‌‌ స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేయగా జోరు కొనసాగించిన డేవిడ్‌‌‌‌‌‌‌‌ 31 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. విజయానికి మరో 25 రన్స్‌‌‌‌‌‌‌‌ కావాల్సిన టైమ్‌‌‌‌‌‌‌‌లో షనక బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో భారీ షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి ఔటయ్యాడు. అప్పటికే మ్యాచ్‌‌‌‌‌‌‌‌ చేతుల్లోకి వచ్చేయగా.. స్మిత్​కు తోడైన స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ గెలుపు లాంఛనం పూర్తి చేశాడు. 
బౌలర్ల కట్టడి
టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన లంక ఇన్నింగ్స్​ నింపాదిగా సాదింది. ఆ టీమ్​కు  స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లోనే షాక్‌‌‌‌‌‌‌‌ తగిలింది. మూడో ఓవర్లోనే ఓపెనర్‌‌‌‌‌‌‌‌ నిసాంక (7)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన కమిన్స్‌‌‌‌‌‌‌‌ ఆసీస్‌‌‌‌‌‌‌‌కు బ్రేక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. అయితే, ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అసలంక రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు  కుశాల్‌‌‌‌‌‌‌‌ పెరీరాతో కలిసి 63 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించాడు. దాంతో, 9 ఓవర్లకు 75/1తో నిలిచిన లంక మంచి స్కోరే చేసేలా కనిపించింది. ఈ దశలో ఆసీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు  జంపా, స్టార్క్‌‌‌‌‌‌‌‌ విజృంభించారు. వరుసగా నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడిచేశారు. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌  జంపా.. అసలంక, అవిష్క (4)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. స్టార్క్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కుశాల్‌‌‌‌‌‌‌‌, హసరంగ (4) పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేరడంతో లంక 94/5 తో కష్టాల్లో పడింది. అయితే, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ షనక (12), చమిక (9) సాయంతో  రాజపక్స స్కోరు 150 మార్కు దాటించాడు.