ఇండియాలో 200 కోట్ల మార్క్ను దాటిన అవతార్ 2

ఇండియాలో 200 కోట్ల మార్క్ను దాటిన అవతార్ 2

అవతార్ 2 మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 5వేల కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టగా.. మన దేశంలో ఇప్పటివరకు 200 కోట్లను రాబట్టింది. దాదాపు 400 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ను ఫిదా చేస్తుంది. మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ జనం ఎగబడి ఈ చిత్రాన్ని చూస్తున్నారు. కొత్త సినిమాలు రిలీజ్ అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దూకుడు తగ్గలేదు.

వారం గడిచినా ఇప్పటికీ అవతార్ 2 సినిమా థియేటర్లో హౌస్ ఫుల్‌తో సందడి చేస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 60 కోట్ల గ్రాస్, 30 కోట్ల నెట్ వచ్చినట్టు సమాచారం. అయితే ఇదే క్రమంలో ఇండియా మొత్తంగా చూసుకుంటే.. దాదాపు రెండు వందల కోట్లు కొల్లగొట్టేసినట్టు తెలుస్తోంది.

2009లో వచ్చిన ‘అవతార్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 13 ఏళ్ల క్రితమే వందల కోట్లు కలెక్ట్ చేసింది ఆ మూవీ. దానికి సీక్వెల్ గా వచ్చిన అవతార్ 2 కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుండడం విశేషం. ఈ మూవీ డిసెంబర్ 16 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.