బడిబాట.. 30 వరకు రోజుకో ప్రోగ్రామ్ 

బడిబాట.. 30 వరకు రోజుకో ప్రోగ్రామ్ 
  • 30 వరకు రోజుకో ప్రోగ్రామ్ 
  • బడిబాటకు స్పాట్ ఎఫెక్ట్

హైదరాబాద్, వెలుగు:  బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఇయాల్టి నుంచి ప్రారంభం కానున్నది. 30 వరకు రోజుకో ప్రోగ్రామ్​ను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాటు చేస్తారు.  ఈ కార్యక్రమంలో మన ఊరు–మన బడి, ఇంగ్లిష్ మీడియం క్లాసులే కీలకంగా మారాయి. బ్యానర్, కరపత్రాల తయారీకి స్కూల్ గ్రాంట్స్​ నుంచి  నిధులు ఖర్చు చేయాలని హెడ్మాస్టర్లకు ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ మంది పిల్లల్ని బడిలో చేర్పించిన 3 జిల్లాలు, 10 స్కూళ్లను ఎంపిక చేసి వారిని సన్మానించనున్నారు. 10వ తారీఖులోపు ఇంటింటి సర్వే తో పాటు ర్యాలీలు, కరపత్రాలు పంచాలి. పిల్లలకు యూనిఫామ్స్, పుస్తకాలు ఇయ్యాలి. విలేజ్ ఎడ్యుకేషన్ రిజిష్టర్​ను అప్​డేట్ చేసి, బాలకార్మికులకు విముక్తి కల్పించాలి. రోజువారి బడిబాట వివరాలను ఎంఈఓ ద్వారా జిల్లా బడిబాట డెస్క్​కు మధ్యాహ్నం 3గంటల వరకు చేరవేయాలి.

ప్రోగ్రాం షెడ్యూల్.. 

13న మన ఊరు–మన బడి, 14న ఇంగ్లీష్‌‌ మీడియం ప్రారంభం, 15న పేరెంట్‌‌ టీచర్ల మీటింగ్, 16న స్కూల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ మీటింగ్‌‌, 17న పొదుపు సంఘాల మహిళలతో సమావేశం, 18న బాలికల విద్య-కెరీర్‌‌ గైడెన్స్‌‌ ప్రోగ్రామ్, 20న సామూహిక అక్షరాభ్యాసం, 21న స్వచ్ఛ పాఠశాల, 22న హరితహారం, 23న ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులను చేర్పించడం, 24న బాలసభ నిర్వహణ, 25న లైబ్రరీడే, 27న  అవుటాఫ్​ స్కూల్ చిల్ర్డెన్ ఎన్​రోల్​మెంట్, 28న బైలింగ్వెల్ పుస్తకాలపై అవగాహన, 29న డిజిటల్ ఎడ్యుకేషన్, 30న మ్యాథ్స్, సైన్స్ డే నిర్వహణ.

స్పాట్ వ్యాల్యూయేషన్​కు టీచర్లు

బడిబాటపై టెన్త్ స్పాట్ వ్యాల్యూయేషన్​ ఎఫెక్ట్ పడనున్నది. గురువారం నుంచే స్పాట్ ప్రారంభమైంది. దీంట్లో హైస్కూల్ టీచర్లు ఎక్కువ మంది ఉంటారు. వీరికి సహాయకులుగా ప్రైమరీ స్కూల్ టీచర్లు ఉంటారు. ఈనెల 12న  జరిగే టెట్ ఎగ్జామ్,  18 వరకు జరిగే  ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణలోనూ టీచర్లే ఉండటం ప్రభావం పడే చాన్స్​ ఉంది. 

ఇవి కూడా చదవండి

బర్త్ డే వేడుకల కోసం వెళ్లి...

కర్ణాటక బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా