త్వరలో రేవంత్ రెడ్డి బయోపిక్.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

త్వరలో రేవంత్ రెడ్డి బయోపిక్.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చేసిన కృషికి ఫలితంగా అధిష్టానం రేవంత్ రెడ్డి(Revanth reddy) తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈనేపధ్యంలో  టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బయోపిక్ తీస్తా అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు (డిసెంబర్ 7) ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. త్వరలో రేవంత్ రెడ్డి బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించారు. విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. ఈ ప్రయాణం ఓ సినిమా స్టోరీకి ఏమాత్రం తక్కువ కాదు. అలాంటి వ్యక్తి జీవితం బయోపిక్ గా తీయాలని భావిస్తున్నాను.. అంటూ బండ్ల గణేష్ తెలిపారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.