సీఎం రేవంత్ రెడ్డికి బండ్ల గణేష్ విషెస్

సీఎం రేవంత్ రెడ్డికి బండ్ల గణేష్ విషెస్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తుల్లో బండ్ల గణేష్ (Bandla Ganesh) ఒకరు. ఎమ్మెల్యే టికెట్టు ఆశించకుండా ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే తన ధ్యేయమని బండ్లన్న ముందునుంచే భావించారు. అలా తాను కోరుకున్నట్లే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బండ్లన్న ఆనందానికి అవధుల్లేవు. 

ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా కాంగ్రెస్ నేత, సినీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలిసి..మొక్కను అందిస్తూ విషెస్ తెలిపారు. తెలంగాణ సీఎంను కలవడం ఆనందంగా ఉందని..రాబోయే ఐదేళ్లలో రేవంత్ రెడ్డి చేపట్టబోయే పథకాలన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాని తెలిపారు. అంతేకాకుండా అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

బండ్ల గణేష్..త్వరలో రేవంత్ రెడ్డి బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం..రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. ఈ ప్రయాణం ఓ సినిమా స్టోరీకి ఏమాత్రం తక్కువ కాదు. అలాంటి వ్యక్తి జీవితం బయోపిక్గా తీయాలని భావిస్తున్న తెలిపారు. మరి ఫ్యూచర్ లో తెరకెక్కిస్తాడేమో చూడాలి.