కాఫీ కప్​కు రూ.5 చార్జ్.. బరిస్టా కేఫ్​కు 22 వేలు ఫైన్

కాఫీ కప్​కు రూ.5 చార్జ్.. బరిస్టా కేఫ్​కు 22 వేలు ఫైన్
  • చండీగఢ్​లోని వినియోగదారుల హక్కుల ఫోరం తీర్పు 

చండీగఢ్: కాఫీ కప్​కు రూ.5 చార్జ్ వేసిన బరిస్టా కేఫ్​కు రూ.22 వేల ఫైన్ పడింది. చండీగఢ్​లో ఇద్దరు కస్టమర్ల కంప్లయింట్స్ పై విచారణ చేపట్టిన వినియోగదారుల హక్కుల ఫోరం.. కేఫ్​కు రూ.22 వేల ఫైన్​ విధిస్తూ తీర్పు ఇచ్చింది. పంజాబ్​లోని మొహాలీకి చెందిన షాబాద్ ప్రీత్ సింగ్ 2021 జనవరి 9న చండీగఢ్ సెక్టార్ 35లోని బరిస్టా కేఫ్ కు వెళ్లారు. అక్కడ ఆయన హాట్ చాకొలేట్ ఆర్డర్ ఇచ్చారు. దీనికి రూ.200 బిల్లు వేశారు. అందులో పేపర్ కప్​కు కూడా రూ.5 చార్జ్ వేసినట్లు షాబాద్ గుర్తించారు.

ఆ కప్​పై బరిస్టా కేఫ్ పేరు రాసి ఉందని, చార్జ్ ఎలా వేస్తారని సిబ్బందిని ప్రశ్నించగా సరైన జవాబు చెప్పలేదు. దీంతో ఆయన చండీగఢ్​లోని వినియోగదారుల హక్కుల ఫోరంలో కంప్లయింట్ చేశారు.ఇలాగే మరో కస్టమర్ పర్మీందర్ జిత్ కూడా ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన వినియోగదారుల హక్కుల ఫోరం.. బరిస్టా కేఫ్​కు రూ.22 వేల ఫైన్ విధిస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. ఒక్కో కస్టమర్ కు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలని, చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్​లో పూర్ పేషెంట్స్ ఫండ్ కు మిగతా20 వేలు జమ చేయాలని ఆదేశించింది.