ఇప్పుడున్న మంత్రి గట్టోడు కాబట్టే.. ఆ ‘ఐఏఎస్ మంత్రి’ కనిపిస్తలేడట

ఇప్పుడున్న మంత్రి గట్టోడు కాబట్టే.. ఆ ‘ఐఏఎస్ మంత్రి’ కనిపిస్తలేడట

ఎవరైనా ఐఏఎస్‌ ఆఫీసర్‌ మంత్రి అయిండని అనుకుంటున్నరా? కాదు.. ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌ లాస్ట్‌ గవర్నమెంట్‌లో మంత్రి లెక్క హల్‌చల్‌ చేస్తుండెనట. బతుకమ్మ లాంటి ప్రోగ్రామ్‌లు వచ్చినపుడు సారే పోస్టర్‌ రిలీజ్‌, సీడీ రిలీజ్‌లు చేస్తుండెనట. మంత్రి ఉన్నా లేనట్లే. ఈ ప్రోగ్రామ్‌లకు పిలువను కూడా పిలువకపోయేదట. అట్లాంటిది ఇపుడు రెండో టర్మ్‌ గవర్నమెంట్‌లో సీన్‌ మారిపోయిందట. ఆఫీసర్‌ సాబ్‌ ఎక్కడా కనిపిస్తలేడట. దాంతోటి అందరూ ‘ఐఏఎస్‌ మంత్రి’కనిపిస్తలేడు అనుకుంటూ చెవులు కొరుక్కుంటున్నరట. అసలు రీజన్‌ ఏందంటే.. అప్పట్లో మంత్రి మెత్తటోడు. ఇప్పటి మంత్రి గట్టోడు. అందుకే ఆఫీసర్‌ను నజర్‌ అందజాల కూడా కనపడనంత దూరంగా పెడ్తున్నడట.