బెల్లంకొండ యాక్షన్ సినిమా.. ఛత్రపతి టీజర్ ఔట్

బెల్లంకొండ యాక్షన్ సినిమా.. ఛత్రపతి టీజర్ ఔట్

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చి.. తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన  సినిమా ఛత్రపతి. ఈ సినిమాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వి.వి. వినాయక్ దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దానికి సంబంధించిన వీడియో రిలీజ్ చేస్తూ ‘యాక్షన్ మొదలైంది’ అని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ట్వీట్ చేశాడు. 

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న థియేటర్స్ లో విడుదల కానుంది. అయితే, టీజర్ విడుదల సందర్భంగా మాట్లాడిన బెల్లంకొండ శ్రీనివాస్.. ‘ఛత్రపతి లాంటి ప్రత్యేక సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి క్షణం ఛాలెంజింగ్‌గా ఫీల్ అయ్యా’అని అన్నాడు.