అనన్య ఇంకా సింగిలే

అనన్య ఇంకా సింగిలే

దర్శకుడు పూరి జగన్నాథ్ టాలీవుడ్ కి పరిచయం చేసిన హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు. విజయ్​ దేవరకొండతో నటించిన ‘లైగర్’​ ఈ స్లిమ్​ బ్యూటీకి సక్సెస్​ను ఇవ్వలేకపోయింది. ‘ఆషికి 2’ సినిమా హీరో ఆదిత్యరాయ్ కపూర్​తో అనన్య డేటింగ్​లో ఉందంటూ బాలీవుడ్​లో టాక్ నడుతస్తోంది. కృతి సనన్​ ఇచ్చిన పార్టీలో వీరిద్దరూ సన్నిహితంగా కనిపించడంతో ఈ రూమర్లు మొదలయ్యాయి. ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, ఆదిత్య ‘గుమ్​రాహ్’​ అనే సినిమా ప్రీమియర్​లో అనన్య అతడికి సపోర్ట్​గా కనిపించడం వంటివి ఈ వార్తలకు బలం చేకూర్చాయి. 

తాజాగా ఈ విషయంపై ఆమె తల్లి భావన క్లారిటీ ఇచ్చింది. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. ‘‘గ్లామర్​ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్లు రావడం కామన్​. కానీ, అనన్య ఇంకా సింగిల్​ గానే ఉంది. ఎవరితోనూ రిలేషన్​లో లేదు. ఇండస్ట్రీలో ఫేమ్​తో పాటుగా నెగిటివిటీని కూడా భరించాల్సి ఉంటుంది. పాజిటివిటీపైనే మేం దృష్టి పెడతాం’’ అంటూ ఆమె తెలిపింది.