దేవుళ్లకు చలిపుడుతుంది..విగ్రహాలకు ఉన్ని దుస్తులు కప్పిన భక్తులు

దేవుళ్లకు చలిపుడుతుంది..విగ్రహాలకు  ఉన్ని దుస్తులు కప్పిన భక్తులు

దేశ వ్యాప్తంగా చలి చంపేస్తుంది. ఉదయం 10గంటల సమయమైన మంచుపడుతుండడంతో ప్రజలు చలికి అల్లాడిపోతున్నారు. స్వెటర్లు,  చలిమంటలు వేసుకొని చలినుంచి ఉపశమనం పొందుతున్నారు.

అయితే మధ్యప్రదేశ్ భూపాల్ లో సంకత్ మోచన్ హనుమాన్ దేవాలయం ఉంది. ఆ ఆలయంలో హనుమాన్ తో పాటు కృష్ణుడు విఘ్నేశ్వరుడి విగ్రహాలు ఉన్నాయి.  దైవరాదన కోసం ఆదేవాలయానికి వచ్చే భక్తులు దేవుళ్లు విగ్రహాలకు చలిపుట్టకుండా ఉన్ని దుస్తులు కప్పుతున్నారు.

ప్రతీఏడు శీతాకాలంలో విగ్రహాలకు చలిపుట్టుకుండా ఉన్ని దుస్తులు కప్పుతామని ఆలయ పూజారి, భక్తులు చెబుతున్నారు.

“నా జీవితంలో మొట్టమొదటిసారిగా, దేవతల విగ్రహాలను ఉన్ని దుస్తులతో కప్పినట్లు నేను చూస్తున్నాను. ఇది చాలా బాగుంది” అని పాయల్ లోధి అనే భక్తుడు చెప్పాడు.

గత నెలలో, వారణాసిలోని తార్కేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని పూజారులు శివుడిని  కాలుష్యం నుండి రక్షించడానికి ముసుగు కప్పారు. “మన దేవతల విగ్రహాల్ని కాలుష్యం నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  శీతాకాలంలో వాటికి ఉన్ని దుస్తులు , వేసవిలో ఎయిర్ కండిషనర్‌లను ఏర్పాటు చేస్తాం.  చెడు గాలి విగ్రహాల నాణ్యతను దెబ్బతీస్తుందని అందుకే ముసుగు వేస్తామని ఆలయ పూజారి సందీప్ మిశ్రా ”చెప్పారు.