డీఐజీకి లేఖ : సార్ నాకు లీవ్ కావాలి..లేదంటే నా భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేను

డీఐజీకి లేఖ : సార్ నాకు లీవ్ కావాలి..లేదంటే నా భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేను

సార్ డిసెంబర్ 11న నా బావమరిది పెళ్లి. నేను తప్పకుండా వెళ్లాలి. లేదంటే నా భార్య పెట్టే టార్చర్ ను నేను తట్టుకోలేనంటూ ఓ కానిస్టేబుల్.., డీఐజీకి రాసిన లేఖ తీరు నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

డిసెంబర్ 7 మధ్యప్రదేశ్ భోపాల్‘కు చెందిన కానిస్టేబుల్ దిలీప్ కుమార్ అహిర్వార్ తనకు 5రోజుల సెలవు కావాలంటూ భోపాల్ డీఐజీ ఇర్షాద్ వలీకి లేఖ రాశారు. ఆ లేఖలో సార్ నా బావమరిది పెళ్లికి నేను వెళ్లాలి. పెళ్లికి వెళ్లలేదంటే తీవ్ర పరిణామాలుంటాయని కోట్ చేస్తూ ఆ లేఖను డీఐజీకి పంపాడు కానిస్టేబుల్.. అదే లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ లేఖపై అడిషనల్ డీజీపీ ఉపేంద్రజైన్ స్పందించారు. దిలీప్ పై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్ని ట్రాఫిక్ విభాగానికి ట్రాన్స్ ఫర్ చేశారు. లీవ్ కోసం లేఖ రాయడం తప్పుకాదు. కానీ ఆ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేయడం తప్పని అన్నారు.