యూఎస్​ రక్షణ శాఖలో.. రాధా అయ్యంగార్​కు టాప్ పోస్ట్

యూఎస్​ రక్షణ శాఖలో.. రాధా అయ్యంగార్​కు టాప్ పోస్ట్

వాషింగ్టన్: అమెరికా రక్షణ శాఖలో ఇండో అమెరికన్​కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ.. యూఎస్ ప్రెసిడెంట్ ​జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. డిఫెన్స్​ మినిస్ర్టీలో డిప్యూటీ అండర్​ సెక్రటరీ (అక్విజిషన్, సస్టైన్మెంట్)గా రాధా అయ్యంగార్​ను ఆయన నియమించారు. ప్రస్తుతం ఆమె డిఫెన్స్​ డిప్యూటీ సెక్రటరీ చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​గా పని చేస్తున్నారు. దీనికి ముందు గూగుల్​లో రీసెర్చ్​ అండ్​ సేఫ్టీ డైరెక్టర్​గా ఉన్నారు. బిజినెస్​ అనలైటిక్స్, డేటా సైన్స్​తో పాటు టెక్నికల్​ రీసెర్చ్​లో క్రాస్​ ఫంక్షనల్​ టీం లీడర్​గా పని చేశారు. ఫేస్​బుక్​లో పాలసీ అనలైసిస్​ గ్లోబల్​హెడ్​గా కూడా జాబ్​ చేశారు. అమెరికా డిఫెన్స్​ శాఖలో నేషనల్సె క్యూరిటీ, విద్యుత్​ శాఖలో సీనియర్​ స్టాఫ్​గా కూడా పని చేశారు. వైట్​హౌస్​ నేషనల్​ సెక్యూరిటీ కౌన్సిల్​లో కూడా కీలక బాధ్యతలు చేపట్టారు.  తనపై నమ్మకం పెట్టుకుని రక్షణ శాఖలో కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్​కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.