ఎయిర్​ఫోర్స్​కు ‘అపాచీ’ పవర్

ఎయిర్​ఫోర్స్​కు ‘అపాచీ’ పవర్

ప్రపంచంలోనే లేటెస్ట్​ హెలికాప్టర్‌‌​అపాచీ ఏహెచ్64ఈ ఎయిర్​ ఫోర్స్​ అమ్ముల పొదిలో చేరింది. అమెరికాకు చెందిన బోయింగ్​ కంపెనీ మొత్తం 22 హెలికాప్టర్‌‌లకు గానూ 8 హెలికాప్టర్‌‌లను మంగళవారం డెలివరీ చేసింది. ఈ హెలికాప్టర్‌‌లకు ఎయిర్​ ఫోర్స్ ఘనంగా స్వాగతం ​పలికింది. బోర్డర్​లో టెన్షన్ల నేపథ్యంలో ఎయిర్​ఫోర్స్​శక్తి, సామర్థ్యాలను మరింత పెంపొందించేలా చేసే ఈ హెలికాప్టర్‌‌లను అందుకోవడం సంతోషంగా ఉందని ఐఏఎఫ్​చీఫ్​ ఎయిర్​మార్షల్​ బి.ఎస్.ధనోవా చెప్పారు. షెడ్యూలు కన్నా ముందే హెలికాప్టర్‌‌లను అందుకున్నట్లు చెప్పారు. నాలుగేళ్ల క్రితం 22 హెలికాప్టర్‌‌ల కొనుగోలుకు బోయింగ్​ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోగా ఇప్పుడు 8 ఛాపర్లు వచ్చాయని చెప్పారు. ఐఏఎఫ్​ఆధునికీకరణలో ఇదో కీలక ముందడుగని ఆయన అభిప్రాయపడ్డారు. మన అవసరాలకు తగ్గట్లుగా ఈ హెలికాప్టర్‌‌లను  ప్రత్యేకంగా డిజైన్​చేయించామని చెప్పారు. వీటిని వెస్ట్రన్​ రీజియన్​లోని ఎయిర్​బేస్​లకు చేరుస్తామని వివరించారు. పాత మిగ్​35 హెలికాప్టర్‌‌ రిప్లేస్​మెంట్​గా ఇవి ఉపయోగపడతాయని అన్నారు. బాలాకోట్​ దాడుల తర్వాత లేటెస్ట్​మోడల్​ హెలికాప్టర్‌‌ల  కొనుగోలు అవసరమనే  అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బోర్డర్​అవతలి వైపు నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఐఏఎఫ్​ను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. తర్వాత ఆరు నెలలు గడిచాక అపాచీ ఏహెచ్64ఈ హెలికాప్టర్‌‌లు రావడం విశేషం.

2015లో ఒప్పందం

ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత.. 2015 సెప్టెంబర్​ లో  మొత్తం 22 అపాచీ హెలికాప్టర్‌‌ల కొనుగోలుకు అమెరికా ప్రభుత్వం, బోయింగ్​ లిమిటెడ్​కంపెనీతో ఐఏఎఫ్​ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం మోడీ సర్కారు 2 బిలియన్​ డాలర్లు ఖర్చుపెట్టింది. తర్వాత 2017లో వీటికి అదనంగా మరో 6 హెలికాప్టర్‌‌ల (వెపన్​సిస్టంతో సహా) కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. దీనికోసం ఆర్మీకి రూ.4,168 కోట్లు కేటాయించింది.

ఇవీ ప్రత్యేకతలు

–  మోస్ట్​అడ్వాన్స్ డ్​ మల్టీరోల్​కాంబాట్​ హెలికాప్టర్‌‌

– ప్రత్యేకంగా డిజైన్​ చేసిన డిజిటల్​ కాక్​పిట్

-హై పెర్ఫార్మెన్స్​టర్బోషాఫ్ట్​ ఇంజన్లు : 2

-మాక్సిమమ్​ క్రూయిజ్​ స్పీడ్​:  గంటకు 284 కి.మి.

-గురితప్పకుండా టార్గెట్​ ను చేరుకుందుకు అడ్వాన్స్ డ్​ లేజర్, ఇన్​ఫ్రారెడ్​ సిస్టం

-ఈ హెలికాప్టర్‌‌ల నుంచి 70 ఎంఎం రాకెట్లు, 30 ఎంఎం ఆటోమాటిక్​ కేనన్​సహా మిస్సైల్స్​ ప్రయోగించవచ్చు

– సెక్యూరిటీ, పీస్​కీపింగ్​ఆపరేషన్లలో ఉపయోగకరం

-ప్రపంచంలో ఇప్పుడున్న ఎటాక్​ హెలికాప్టర్‌‌లలో  బెస్ట్​ ఇదే

ఇట్లుంటది

బరువు  ​(ప్రైమరీ) : 6838 కిలోలు

ఎగిరే సామర్థ్యం (వెర్టికల్​గా) :  నిమిషానికి 2800 ఫీట్లు వరకు

హెలికాప్టర్‌‌​ ఎత్తు : 15.24  ఫీట్లు

రెక్కల నిడివి : 17.15  ఫీట్లు

ఇంకొన్ని…

… బోయింగ్​ కంపెనీ స్టార్ట్​ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు 2200 హెలికాప్టర్‌‌లను ప్రపంచంలోని వివిధ దేశాలకు అమ్మింది

… అపాచీ హెలికాప్టర్‌‌లను అందుకున్న దేశాలలో  మనది 16వ దేశం

… ఈ హెలికాప్టర్‌‌​ను నడిపేందుకు 2018లో  ఐఏఎఫ్​ పైలట్లు అమెరికాలో ట్రైనింగ్​ తీసుకున్నారు

… మొన్న జులైలోనే ఈ 8 హెలికాప్టర్‌‌లు ఇండియాకు చేరుకున్నాయి

…. మంగళవారం వీటిని అధికారికంగా ఎయిర్‌‌ ఫోర్సులోకి ప్రవేశపెట్టారు