నుమాయిష్ దగ్గర కూలిన భారీ వృక్షం.. వాహనాలు ధ్వంసం

నుమాయిష్ దగ్గర కూలిన భారీ వృక్షం.. వాహనాలు ధ్వంసం

హైదరాబాద్:  నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎంట్రెన్స్ వద్ద భారీ ప్రమాదం తప్పింది.  నూమాయిష్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న భారీ చెట్టు కూలింది. ఈ ప్రమాదంలో చెట్టు కింద పార్కింగ్ చేసిన పలు వాహనాలు దెబ్బతిన్నాయి. చెట్టు కూలడంతో ఏడు బైకులు, మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు కలిసి చెట్టు కొమ్మలు తొలగించి వాహనాలు బయటకు తీశారు. చెట్టు కూలిన సమయంలో అక్కడ జనం ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తిగా ఎండిపోయిన చెట్టును తొలగించాలని ఎన్నిసార్లు జీహెచ్ఎంసీ అధికారులను కోరినా పట్టించుకోకపోవడంతోనే కూలిపోయిందని స్థానికులు అంటున్నారు.
 

For more news..

అసమర్ధుడిని సీఎం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం

వానరానికి శ్రాద్ధకర్మలు.. ఇద్దరి అరెస్ట్