అసమర్ధుడిని సీఎం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం

అసమర్ధుడిని సీఎం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం

ఉచిత విద్యుత్ ఇచ్చింది మొదట కాంగ్రెస్ పార్టీయేనన్నారు పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన..రైతు రుణమాఫీ చేయడమే కాదు, రుణమాఫీ లేని రైతులకు ఖాతాలో 5వేలు వేశామన్నారు.మార్కెట్ లో దళారీ దందా లేకుండా పంటలకు మద్దతు ధర కల్పించామన్నారు.మార్కెట్ ఇంటెర్వెన్స్ పథకం ద్వారా రైతులను ఆదుకున్నామని చెప్పారు.2004-  /2014 వరకు రైతు పక్షాన కాంగ్రెస్ పార్టీ పనిచేసిందని చెప్పారు రేవంత్ రెడ్డి. వ్యవసాయ పనిముట్లు, ఎరువులను సబ్సిడీ పై అందించిందని అన్నారు. అంతేకాదు..అనుకోకుండా చనిపోయిన రైతులకు లక్ష 50వేల రూపాయలు అందించామన్నారు. 

గుంటూరు లో చదువుకొని.. అమెరికాలో పై చదువులు చదివి అక్కడి హోటల్ లో పని చేసిన కేటీఆర్..  ఉత్తర కుమారుడిగా మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏ మాత్రం సమర్థత లేకపోయిన కేసీఆర్.. కేటీఆర్ కు బోలెడన్ని శాఖలు అప్పగించారన్నారు. అప్పగించిన శాఖలన్నీ దివాళా తీసి.. రాష్ట్రానికి నష్టం వాటిల్లేలా చేస్తున్నాడని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఓ అసమర్థుడుని సీఎం చేయడానికి కేసీఆర్ శతవిధాలా పనిచేస్తున్నాడన్నారు.

50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది అని చెబుతున్నారు. దీనిపై కేటీఆర్ సవాల్ కూడా విసరడం జరిగిందన్న రేవంత్.. దాన్ని కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తోందన్నారు. 2014 నుండి TRS   ప్రభుత్వం  రైతుల కోసం ఏం చేశారో మాట్లాడుకుందామన్నారు. దీనిపై చర్చించేందుకు డేట్ చెప్పండి..  ఎక్కడికి  రమ్మంటే అక్కడికి వస్తామని  స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం