కాగజ్‌నగర్‌లో ఇదేం వాన బాబోయ్.. వరదలో వాటర్ డబ్బాలు కొట్టుకపోయినయ్..!

కాగజ్‌నగర్‌లో ఇదేం వాన బాబోయ్.. వరదలో వాటర్ డబ్బాలు కొట్టుకపోయినయ్..!

కాగజ్‌నగర్‌: కుమురం బీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. రోడ్ల పైకి భారీగా వరద నీరు చేరి వాగు పొంగినంత రేంజ్లో వరద నీళ్లు ప్రవహించాయి. వరద ప్రవాహంలో కిషోర్  కుమార్ అనే వ్యాపారి షాపు బయటపెట్టిన వాటర్ డబ్బాలు కొట్టుకపోయినయ్. కిలోమీటర్ దూరం వరకు ఆ డబ్బాలు వరద నీళ్ల ఫ్లోటింగ్ దెబ్బకు పోతూనే ఉన్నాయి. వరద తగ్గిన తర్వాత ఆ వాటర్ డబ్బాలను సదరు వ్యాపారి తిరిగి తెచ్చుకున్నాడు. వాటర్ డబ్బాలు వరదలో కొట్టుకపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఇక.. వాతావరణ శాఖ వర్షాలపై చేసిన సూచన ఏంటంటే.. ఋతు పవన ద్రోణి ప్రభావంతో ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఈ కారణంగా తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. గురువారంతో పాటు వచ్చే రెండు రోజులు రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది. వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షం చెప్పింది.

 రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ  తెలిపింది. చెట్ల కింద ఎవరూ ఉండొద్దని సూచించింది.