జైపూర్(భీమారం), వెలుగు: మంచిర్యాల జిల్లాలో భీమారం మండలంమంచిర్యాల జిల్లా అధిక వడ్డీ ఆశ చూపి రూ.1.58 కోట్లు మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమారం పోలీస్ స్టేషన్ లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. భీమారంకు చెందిన వేముల శ్రావణ్ గౌడ్, అతని తమ్ముడు రాజ్ కిరణ్ గౌడ్ బేకరీ, టిఫిన్ సెంటర్ నడుపుతూ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. వాటర్ ప్లాంట్, పేపర్ ప్లేట్ల వ్యాపారం చేసి నష్టపోయాడు.
ఈక్రమంలో అన్నదమ్ములు కలిసి శాండ్ క్వారీ కాంట్రాక్ట్ వచ్చిందని బంధువులను, తెలిసిన వారిని నమ్మించి పార్ట్నర్ షిప్, అధిక వడ్డీ ఇస్తామని నమ్మించి 62 మంది నుంచి రూ.1.58 కోట్లు వసూలు చేశారు. డబ్బుల ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో నెల కింద కుటుంబ సభ్యులతో కలిసి ఉడాయించాడు. బాధితుడు కొత్తపోటు మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రావణ్ గౌడ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి తమ్ముడు రాజ్ కిరణ్ గౌడ్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.
నెక్కొండ: లక్కీడ్రాపేరుతో కస్టమర్లను మోసం చేసిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. వరంగల్ జిల్లా నెక్కొండ పట్టణానికి చెందిన మేరుగు విజయ్, జన్ను రవి, నెక్కొండ తండాకు చెందిన బానోత్ శ్రీకాంత్, అప్పల్‌రావుపేటకు చెందిన కొయ్యాడ శ్రీనివాస్ కలిసి మండలంలోని అప్పల్రావుపేట శివారులోని ఎస్ఎస్ఆర్ఆర్ వెంచర్లో ఐదు వందలకే 175 గజాల ప్లాట్ అంటూ లక్కీడ్రా పేరుతో 2 వేల మంది వద్ద రూ.లక్ష వసూలు చేసి ముఖం చాటేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్కావడంతో వెంచర్‌పై పోలీసులు దాడి చేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
