జైపూర్ (భీమారం) వెలుగు: భీమారం మండల కేద్రంలోని ఏఎంసీ గోడౌన్ నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ వరకు సీసీ రోడ్డు పనులను సోమవారం సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి ఎంపీడీవోతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకట స్వామి కృషితో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంఎన్ ఆర్ఈజీ ఎస్ స్కీం ద్వారా రూ.12. 50 లక్షల నిధులు కేటాయించినట్లు చెప్పారు.
అనంతరం ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ గా ఏర్పాటు చేసి సుంకరిపల్లి కాలనీ నుంచి ఆరేపల్లి వైపు వెళ్లే ప్రజల రాకపోకలకు మత్తడి పైన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు శాంక్షన్ చేయాలని మంత్రి సిఫారస్సు చేసిన లెటర్ ను ఎల్లక్కపేట ఇరిగేషన్ ఆఫీసులో డీఈ సునీతకు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు పోడేటి రవి, మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ నాయక్, ఉష్కమల్ల శ్రీనివాస్ పున్నం చంద్, ఆవుల సురేశ్ యాదవ్, ఏఈ రాజ్ కుమార్, వార్డ్ మెంబర్లుపాల్గొన్నారు.
