హైదరాబాద్ సిటీలో కుండపోత వాన.. పంజాగుట్ట వైపు వెళ్తుంటే మాత్రం ఇది మస్ట్గా తెలుసుకోండి !

హైదరాబాద్ సిటీలో కుండపోత వాన.. పంజాగుట్ట వైపు వెళ్తుంటే మాత్రం ఇది మస్ట్గా తెలుసుకోండి !

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో శుక్రవారం సాయంత్రం 3 గంటల సమయం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందేమో అనేంతలా కురిసిన కుండపోత వర్షానికి రోడ్లు వాగులను తలపించాయి. సిటీలోని ప్రధాన ఏరియాలైన పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్. ఆర్ నగర్, బోరబండ, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. యూసఫ్ గూడ, కృష్ణానగర్ ప్రాంతాల్లోని బస్తీల్లో రోడ్లపై మోకాలి లోతు నీళ్లు కనిపించాయి.

భారీ వర్షం కారణంగా పంజాగుట్ట మెట్రో స్టేషన్, పంజాగుట్ట సర్కిల్ ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. హైదరాబాద్ సిటీలోనే ప్రధాన కూడలి కావడంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. నీళ్లు నిలిచే అవకాశం ఉన్న ఏరియాల్లో వరద నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు వాటర్ బోర్డ్, జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. భారీ వర్షానికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది.

Also Read:-హైదరాబాద్లో సెల్ టవర్లకు దగ్గర్లో ఉన్నోళ్లు జాగ్రత్త.. .. అలా చేస్తే సేఫ్ అంటున్న హైడ్రా !

వర్షాల నేపథ్యంలో ఇంపాక్ట్ ఫోర్ క్యాస్ట్ ను వాతావరణ శాఖ విడుదల చేసింది. మరో మూడు గంటల పాటు హైదరాబాద్ సిటీకి వర్ష సూచన చేసింది. శుక్రవారం సాయంత్రం 4  గంటల నుంచి 7 గంటల వరకు హైదరాబాద్ సిటీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షానికి ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్ సిటీతో పాటు సిటీ శివారు ప్రాంతాలకు మరో మూడు గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ కొనసాగనుంది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించిది.