ఇంట్లో ఉంటే ఇంట్లోనే.. ఆఫీసులో ఉంటే ఆఫీసులోనే ఉండండి: దయచేసి బయటకు రావొద్దు ఇప్పుడల్లా !

ఇంట్లో ఉంటే ఇంట్లోనే.. ఆఫీసులో ఉంటే ఆఫీసులోనే ఉండండి: దయచేసి బయటకు రావొద్దు ఇప్పుడల్లా !

హైదరాబాద్ సిటీ మొత్తం భారీ వర్షం పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. వీకెండ్.. అసలే శుక్రవారం సాయంత్రం.. రాబోయే రెండు రోజులు ఐటీ ఉద్యోగులకు హాలి డేస్.. చాలా మంది త్వరగా వెళ్లాలనే తాపత్రయంతో వర్షం పడుతున్నా.. రోడ్డెక్కి ఇంటికి వెళ్లాలని.. రోడ్డెక్కి ఊరెళ్లాలని.. పార్టీలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం.. వెంటనే ఆ ప్లాన్స్ను వాయిదా వేసుకోండి.. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి.. ట్రాఫిక్ జాం అయ్యింది.. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు బారులు తీరాయి.. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ఇస్తున్న అలర్ట్ ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ సిటీలో రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా టీంలు వరద నీళ్లు నిలిచిపోకుండా ఎంత శ్రమిస్తున్నా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో వరద నీళ్లు మోకాలి లోతు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ ఏరియా.. ఆ ఏరియా అనే తేడా లేకుండా హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఏరియాల్లో ట్రాఫిక్ తిప్పలతో వాహనదారులకు నరక యాతన పడుతున్నారు. ముఖ్యంగా.. సికింద్రాబాద్ వైపు ట్రాఫిక్ తిప్పలు దారుణంగా ఉన్నాయి.

 

జేబీఎస్, కార్ఖానా, తిరుమల గిరి.. అల్వాల్ వైపు వెళుతున్న వాళ్లు మాత్రం ట్రాఫిక్తో అల్లాడిపోతున్నారు. దాదాపు రెండు కిలోమీటర్లకు పైగానే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక.. మాదాపూర్, హైటెక్ సిటీ, ఇనార్బిట్ మాల్ రూట్లో కూడా ఫుల్ ట్రాఫిక్ జాం అయింది. మలక్ పేట్ యశోదా ఆసుపత్రి దగ్గర నుంచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. లక్డీ కా పూల్ నుంచి మెహిదీపట్నం రూట్లో అయితే ట్రాఫిక్ జాంతో వాహనదారులు చుక్కలు చూస్తున్న పరిస్థితి ఉంది.