Chiranjeevi: మెగాస్టార్ 'విశ్వంభర' రహస్యం లీక్.. వశిష్ఠ చెప్పిన 14 లోకాల కథ!

Chiranjeevi: మెగాస్టార్ 'విశ్వంభర' రహస్యం లీక్..  వశిష్ఠ చెప్పిన 14 లోకాల కథ!

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'విశ్వంభర' ( Vishwambhara) .  యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఒక హిట్ డైరెక్టర్ తో వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.  చిరంజీవి సరసన త్రిష( Trisha ) నటిస్తుంది. ఇప్పటికే  ఈ పోస్టర్లు మూవీపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.  ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనప్పటికీ..  దర్శకుడు వశిష్ఠ ఒక ఇంటర్యూలో ' విశ్వంభర 'గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.  సినిమా కథను కూడా లీక్ చేసి అభిమాలను మరింత ఉత్సాహపరిచారు. 

హీరోయిన్ కోసం హీరో 14 లోకాలు దాటి..
'విశ్వంభర' మూవీపై ఉన్న ఊహాగానాలను వశిష్ఠ పటాపంచలు చేశారు  దర్శకుడు వశిష్ఠ. సినిమా స్టోరీపై క్లారిటీ ఇచ్చారు. మనకు మొత్తం 14 లోకాలుంటాయి. అవి కింద 7 ఉండగా, పైన 7 ఉంటాయి. స్వర్గం, పాతాళం, యమలోకం.. ఇలా వీటన్నింటికీ మెయిన్ లోకం సత్య లోకం, అదే బ్రహ్మ లోకం. ఇప్పటివరకు చాలామంది దర్శకులు తమకు నచ్చిన పద్ధతిలో, నచ్చిన లోకాన్ని చూపించారు. కానీ నేను ఇప్పుడు సత్యలోకాన్ని చూపించబోతున్నానని చెప్పుకొచ్చారు. విశ్వమంతటినీ భరించేదే విశ్వంభర. ఆ సత్యలోకంలో ఉన్న హీరోయిన్ కోసం హీరో 14 లోకాలు దాటి వెళ్తాడు. ఆ సత్యలోకం నుంచి హీరోయిన్‌ను హీరో ఎలా కిందకు తీసుకొచ్చాడు అనేది ఈ సినిమా ప్రధాన కథ" అని వెల్లడించారు. 

భారీ బడ్జెట్‌తో సత్యలోకం సెట్‌
ఈ వివరణ వినగానే మెగా అభిమానులు థ్రిల్ అవుతున్నారు. చిరంజీవి వంటి స్టార్ హీరో పౌరాణిక ఫాంటసీ అంశాలతో కూడిన ఇలాంటి కథలో నటించడం సినిమాకు మరింత బలం చేకూరుస్తుంది. 'విశ్వంభర' కోసం ఇప్పటికే అత్యంత భారీ బడ్జెట్‌తో సత్యలోకం సెట్‌ను నిర్మించారు. ఈ సెట్స్ సినిమాకు ఒక ఐ ఫీస్ట్‌గా ఉంటాయని వశిష్ఠ నొక్కిచెప్పాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సత్యలోకాన్ని తెరపై ఎలా చూపిస్తారు, చిరంజీవి ఆ లోకాల్లో సాహసాలు ఎలా చేస్తారు అనే ఉత్సాహం ప్రేక్షకుల్లో మరింత పెరిగిపోతోందని వివరించారు. 

చిరంజీవి కెరీర్‌లో ఫాంటసీ, సోషియో ఫాంటసీ చిత్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'అంజి' వంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. ఈ సినిమాల్లో చిరు నటన, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి ఒక పూర్తిస్థాయి ఫాంటసీ చిత్రంలో నటించడం అభిమానులకు పండగే. వశిష్ఠ వంటి యువ దర్శకుడు చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా, సరికొత్త సాంకేతిక హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నటు వశిష్ఠ తెలిపారు.

 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వంభర' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, వినూత్నమైన కథనం, స్టార్ క్యాస్ట్,, మెగాస్టార్ చిరంజీవి వంటి అంశాలతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. 'విశ్వంభర' తెలుగు సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.