హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం.. ఫుడ్ కోర్టులో చెలరేగిన మంటలు

హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం.. ఫుడ్ కోర్టులో చెలరేగిన మంటలు

గ్రేటర్  హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్‌పేట్ వెళ్లే ప్రధాన రహదారి లెనిన్ నగర్‌లో ఉన్న ఫుడ్ కోర్ట్‌లో  మంటలు చెలరేగాయి. 

 స్థానికుల సమాచారం మేరకు మీర్‌పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.అప్పటికే ఫుడ్ కోర్టు పూర్తిగా దగ్ధమైంది.   అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఫుడ్ కోర్ట్ మూసివుండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. 

ఇటీవలే నాంపల్లిలోని ఫర్నీచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు చనిపోయారు.