
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరోసారి రెపోరేటు తగ్గించే అవకాశం కనిపిస్తోంది..రెపోరేటును మరో 25బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది.దీంతో రెపోరేటు 5.25శాతం తగ్గుతుందని అంచనా. ద్రవ్యోల్బణం తగ్గించడం, ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో RBI ఈ నిర్ణయం తీసుకుంటోందటున్నారు ఆర్థిక నిపుణులు.
జూన్ 6, 2025 నాటి RBI ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దీంతో రెపోరేటు 5.50శాతానికి చేరుకుంది. దీనికి ముందు ఫిబ్రవరి లో కూడా 25 బేస్ పాయింట్లు, ఏప్రిల్ లో 25 బేస్ పాయింట్ల చొప్పున రెపో రేటును తగ్గించారు. మొత్తం మీద ఫిబ్రవరి 2025 నుంచి ఇప్పటివరకు RBI 100 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది.
ఆగస్టులో మరోసారి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు సార్లు రేటు కోతలు ఉంటాయని అంచనా వేస్తున్నారు ఆర్థిక వేత్తలు. దీనితో రెపో రేటు 5.25శాతానికి చేరుకునే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం ,ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం రేటు కోతలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
ఏప్రిల్ 2025లో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారంగా ఏడాదిలో ద్రవ్యోల్బణం 3.2శాతానికి తగ్గింది. ఇది దాదాపు ఆరు సంవత్సరాల కనిష్టం. ఆహార ద్రవ్యోల్బణం ఆరు వరుస నెలలుగా తగ్గుతూ వస్తోంది.
RBI ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం..
దుపరి MPC సమావేశం ఆగస్టు 4-6, 2025 తేదీలలో జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేటుపై నిర్ణయం ప్రకటించనున్నారు. 25 బేసిస్ పాయింట్ల రెపో రేటు తగ్గింపుతో ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు RBI నుంచి తక్కువ వడ్డీకి నిధులను పొందుతాయి. ఇది బ్యాంకులు తమ కస్టమర్లకు అందించే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా EMIలు తగ్గుతాయి, రుణగ్రహీతలకు ఉపశమనం లభిస్తుంది.
పెరిగిన క్రెడిట్ ప్రవాహం: తక్కువ వడ్డీ రేట్లు రుణ డిమాండ్‌ను పెంచుతాయి.ముఖ్యంగా వ్యాపారాలకు పెట్టుబడులను అందిస్తుంది. పారిశ్రామిక వృద్ధిని పెంచుతుంది, ఉద్యోగాలను సృష్టిస్తుంది.
తక్కువ రుణ వడ్డీరేట్లు వినియోగాన్ని ,పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. ఇది మొత్తం ఆర్థిక లావాదేవీలను పెంచుతుంది.GDP వృద్ధికి తోడ్పడుతుంది. RBI 2026 ఆర్థిక సంవత్సరానికి 6.5శాతం GDP వృద్ధిని అంచనా వేస్తుంది.
ద్రవ్య లభ్యత పెంపు: బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరుగుతుంది.ఇది ఆర్థిక వ్యవస్థలో నిధుల దండిగా లభిస్తాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రేట్లపై ప్రభావం: అయితే ఫిక్స్ డ్ డిపాజిట్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. రెపో రేటు తగ్గినప్పుడు బ్యాంకులు సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తాయి. ఇది స్థిర ఆదాయంపై ఆధారపడే వారికి ప్రతికూలంగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇంతకుముందే ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన వారికి డిపాజిట్ చేసినప్పుడు తీసుకున్న వడ్డీ రేట్లే అమలవుతాయి.
మొత్తంగా ఆగస్టులో రెపో రేటు తగ్గింపు అంచనాలు దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని ఆర్థిక వృద్ధికి మరింత ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి.