కోర్టులపై పిల్లల్లో విషం నింపుతారా.. NCERT పుస్తకం వివాదంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..!

కోర్టులపై పిల్లల్లో విషం నింపుతారా.. NCERT పుస్తకం వివాదంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..!

NCERT ప్రచురించిన 8వ తరగతి  పుస్తకంలో న్యాయవ్యవస్థ అవినీతి ప్రస్తావనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై  విద్యార్థుల్లో విషం నింపుతారా.. విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాల్లో  న్యాయవ్యవస్థను కించపర్చేలా పాఠ్యాశాలు పెట్టమేంటని ప్రశ్నించింది. ‘‘ఇది  సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. న్యాయవ్యవస్థ ను ఎవరు కించపర్చినా చర్యలు తప్పవు అన్నారు. 

 సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీ  ఈ విషయాన్ని కోర్టు ముందుంచగా జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ సుర్యకాంత్  తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.హైకోర్టు జడ్జీలు సహా  న్యాయమూర్తులనుంచి అనేక కాల్స్, మెసేజ్ లు అందుతున్నాయి.. వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు..‘‘ఇది  సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. న్యాయవ్యవస్థ ను ఎవరు కించపర్చినా చర్యలు తప్పవు’’ అని అన్నారు. 

NCERT ప్రచురించిన 8వ తరగతి  పుస్తకంలో న్యాయ అవినీతి అనే పదాన్ని   చేర్చడంపై  కోర్టులో ప్రస్తావించిన కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీ..  ఇది చాలా బాధాకరమైన విషయం అన్నారు. రాజకీయ నేతలు, అధికారుల అవినీతిని ప్రస్తావించకుండా ఒకస్వయం ప్రతిపత్తిగల సంస్థను  ప్రత్యేకంగా ఎత్తిచూపుతున్నట్లు కనిపిస్తోందని వాదించారు. ఇది న్యాయవ్యవస్థను అపకీర్తిపాలుచేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ విషయంపై స్పందంచిన  చీఫ్ జస్టిస్..ఈ విషయం తనకు తెలుసని,  చర్యలు తీసుకుంటామని అన్నారు. న్యాయ సంస్థపై ఎటువంటి దాడిని కోర్టు సహించదని స్పష్టం చేశారు సీజేఐ.