Sharwa BHOGI: భోగీ ఫస్ట్ లుక్ తోనే శర్వా విశ్వరూపం.. 1960 బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సంపత్ నంది భారీ ప్రయోగం

Sharwa BHOGI: భోగీ ఫస్ట్ లుక్ తోనే శర్వా విశ్వరూపం.. 1960 బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సంపత్ నంది భారీ ప్రయోగం

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసిన శర్వానంద్.. మరో కొత్త మూవీతో వస్తున్నారు. మాస్ క్లాస్ కు చిరునామగా నిలిచిన సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్నాడు. అదే ‘భోగి’ (BHOGI). కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.

‘భోగి’ ఫస్ట్‌లుక్‌ బీభత్సం: 

‘భోగి’ విడుదల తేదీతో పాటు శర్వా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. శర్వానంద్‌ డిఫరెంట్‌లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. మాస్ గెటప్‌లో, చేతిలో పదునైన ఆయుధం పట్టుకుని తీవ్రమైన ఆవేశంతో కనిపిస్తున్నారు. ఆయన మేకోవర్, ఆ గడ్డం, కళ్లలో కనిపిస్తున్న ఇంటెన్సిటీ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

పీరియాడికల్ యాక్షన్ డ్రామా

‘భోగి’ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతాల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందిస్తునారు సంపత్ నంది. కథలో ప్రాంతీయ సంస్కృతి, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలును ఎంచుకుని భారీ ప్రయోగం చేయనున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ స్పార్క్ వీడియో వీపరీతంగా ఆకట్టుకుంది. అందులో చూపించిన కాన్సెప్ట్, తగలబడి పోతున్న ఊరు, టైం ట్రావెల్ విజువల్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ‘భోగి’తో శర్వానంద్ సాలిడ్ హిట్ కొట్టడం కన్ఫామ్ అని సంకేతాలను పోస్టర్, వీడియో విజువల్స్ ఇస్తున్నాయి.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.