గోవిందా గోవిందా : 120 కోట్ల KYC రికార్డులు AI యాప్స్ లో లీక్.. బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తారా ఏంటీ..!

గోవిందా గోవిందా : 120 కోట్ల KYC రికార్డులు AI యాప్స్ లో లీక్.. బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తారా ఏంటీ..!

మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యాప్స్  వాడుతున్నారా ? అయితే  కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే తాజాగా రెండు ప్రముఖ AI యాప్స్  నుండి భారీ స్థాయిలో డేటా లీక్ అయ్యింది. ఇందులో సుమారు 120 కోట్లకు పైగా KYC రికార్డులు, 20 కోట్ల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు బయటపడ్డాయి.

సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని AI యాప్స్  యూజర్ల డేటాను దాచే డేటాబేస్'లకు ముందుజాగ్రత్తగా పాస్‌వర్డ్ ప్రొటెక్షన్  పెట్టలేదు. దీనివల్ల ఎవరైనా ఆన్‌లైన్‌లో ఆ వివరాలను చూసే అవకాశం ఉంటుంది.

దింతో వినియోగదారుల  ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు వివరాలు.. పూర్తి పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్,  ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగత వివరాలు సహా వారు అప్‌లోడ్ చేసిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు బయటపడ్డాయి. ఈ డేటా 26 దేశాలకు చెందిన ప్రజలది. ఇందులో అమెరికా తర్వాత ఆసియా దేశాల డేటా కూడా ఎక్కువగా ఉంది.

ఈ డేటా లీక్ వల్ల మీ ఫోటోలు, ఐడీ కార్డులు వాడి స్కామర్లు మోసాలు చేయవచ్చు. మీ వ్యక్తిగత వివరాలతో లోన్లు తీసుకోవడం లేదా ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ఇంకా లీక్ అయిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తప్పుడు పనులకు వాడే ప్రమాదం ఉంది.

చాలా AI యాప్స్  ఫోటోలను అందంగా మార్చుడానికి  లేదా వెరిఫికేషన్ కోసం ఐడీ కార్డులు అడుగుతుంటాయి. కానీ, ఆ కంపెనీలు మన డేటాను ఎంత సేఫ్ గా  దాస్తున్నాయో ఎవరికీ తెలియదు. కొత్తగా వచ్చే ప్రతి AI యాప్ ని నమ్మి మన వ్యక్తిగత సమాచారం, ఫోటోలను అప్‌లోడ్ చేయడం చాలా ప్రమాదకరమని ఈ ఘటన హెచ్చరిస్తోంది.