తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్యామ్ కోషి..

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్యామ్ కోషి..

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్యామ్ కోషి బాధ్యతలు స్వీకరించనున్నారు. శుక్రవారం ( జులై 18 ) తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు శ్యామ్ కోషి. శనివారం ( జులై 20 ) పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ ప్రమాణం చేయనున్నారు. 2023 జులై 8న చత్తీస్‌‌గఢ్‌‌ హైకోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్న జస్టిస్ పి.శ్యామ్ కోశీని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జె.సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉండగా.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులు కావడం గమనార్హం. కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అపరేష్ కుమార్ సింగ్ త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తెలంగాణ హైకోర్టుకు ప్రస్తుతం తాత్కాలిక సీజేగా కొనసాగుతున్న సుజయ్ పాల్ను కోల్కత్తా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.

ఇక.. తెలంగాణ కొత్త సీజే పూర్వాపరాలను పరిశీలిస్తే.. అపరేష్ కుమార్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్ బీ పట్టా పొందారు. 1990 నుంచి 2000 వరకూ ఉత్తర్ ప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 2001లో న్యాయవాదిగా జార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు.. 2022 నుంచి 2023 వరకూ జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.