ఇయ్యాల (జులై 18న) నాగార్జునసాగర్ కు డిప్యూటీ సీఎం రాక

ఇయ్యాల (జులై 18న) నాగార్జునసాగర్ కు డిప్యూటీ సీఎం రాక

హాలియా, వెలుగు : డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నేడు నాగార్జునసాగర్ కు రానున్నారు. శుక్రవారం ఉదయం 8:30 హైదరాబాద్ బేగంపేట్ ప్రజా భవన్ నుంచి రోడ్ మార్గాన డిప్యూటీ సీఎం బయల్దేరి 11:30 నాగార్జున సాగర్ కు చేరుకుంటారు. అనంతరం 11:35 నుంచి 12:05 గంటల వరకు హైడ్రో పవర్ ప్లాంట్ ను ఆయన సందర్శిస్తారు. అక్కడే విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత  1:05 గంటలకు విజయ్ విహార్ గెస్ట్ హౌస్ చేరుకొని భోజనం చేస్తారు. అనంతరం మంత్రి మధ్యాహ్నం 2 గంటలకు విజయ్ విహార్ గెస్ట్ హౌస్ నుంచి తిరిగి హైదరాబాద్ కు బయల్దేరుతారు. 

560 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం..

ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం 560. 40  అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం కుడి, ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా 69,522 క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరుతున్న క్రమంలో డ్యాం నీటిమట్టం ఘణనీయంగా పెరుగుతోంది. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.040 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 560. 40 అడుగులకు (233.3482 టీఎంసీలు) చేరింది.