హైదరాబాద్ లో ఈగల్ టీం దూకుడు పెంచింది. డ్రగ్స్ సరఫరాను ఎక్కడికక్కడ పట్టుకుంటుంది. లేటెస్ట్ గా ఫిబ్రవరి 16న కొండాపూర్ లోని ఓ రెసిడెన్సీలో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసింది. ఈ ముఠాలో ఇద్దరు వ్యాపారులతో పాటు స్టూడెంట్ ఉన్నాడు. నిందితుల నుంచి 32 గ్రాముల కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మురళీకృష్ణ రాజ్ తో పాటు చిరంజీవి వర్మ, హేమంత్ రాజ్ లను అరెస్ట్ చేశారు. వీరిని రిమాండ్ కు తరలించారు.
వీళ్లు బెంగళూరు, గోవా నుంచి కోకైన్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ గ్రాముకు రూ.7 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో రూ.12 వేలకు అమ్ముతున్నారు. వాట్సాప్, వైఫై ద్వారా కస్టమర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. డెడ్ డ్రాప్ మోడల్ ద్వారా డ్రగ్స్ డెలివరీ చేస్తున్నారు. ఆన్‌లైన్ ట్రాన్సక్షన్ల ద్వారా డబ్బు సేకరిస్తున్నారు. బెంగళూరు–హైదరాబాద్ ప్రైవేట్ బస్సుల ద్వారా రవాణా చేస్తున్నారు. జబ్బార్ ట్రావెల్స్ డ్రైవర్, రాపిడో డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులకు కోకైన్ వినియోగిస్తున్నట్లు నిర్ధారించారు. వీళ్లు హైదరాబాద్ లోని 15 మంది ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
