గుడ్ న్యూస్ : రైతుల ఖాతాల్లో రూ.514 కోట్ల సన్న వడ్ల బోనస్

గుడ్ న్యూస్ : రైతుల ఖాతాల్లో రూ.514 కోట్ల సన్న వడ్ల బోనస్

 రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూ్స్ చెప్పింది. ఖరీఫ్ లో సన్నవడ్ల కొనుగోలుకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న బోనస్ బకాయిలను క్లియర్ చేస్తూ రూ. 514 కోట్ల36 లక్షల నిధులను విడుదల చేసింది. క్వింటాల్ కు రూ.500 చొప్పున బనస్ రూపంలో రైతుల ఖాతాలో నేరుగా జమకానున్నాయి. దీని ద్వారా సుమారు 2.17లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొత్తం రూ. 1939 కోట్ల బోనస్ ను చెల్లించింది.  

 వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు, రైతులను ప్రోత్సహించేందుకు  తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అదనంగా ఇస్తోంది. దీంతో రైతులకు ఆర్థికంగా మరింత చేయూత అందించినట్లు అవుతోంది.