ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ హత్యకేసులో.. మాజీ AAP కౌన్సిలర్ కు జీవిత ఖైదు

ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ హత్యకేసులో.. మాజీ AAP కౌన్సిలర్ కు జీవిత ఖైదు

ఢిల్లీ అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ కు జీవిత ఖైదు పడింది. 2020 నాటి ఈ కేసులో తాహిర్ హుస్సేన్ తోపాటు దోషులందరికీ జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీ కోర్టు శుక్రవారం తీర్పుచెప్పింది. 

శిక్షను ప్రకటిస్తూ.. అంకిత్ శర్మ హత్య  యావజ్జీవ శిక్ష విధించేంత  తీవ్రమైన నేరం అని కోర్టు వ్యాఖ్యానించింది. సమాజంపై చాలా కాలం ప్రభావం చూపుతుందని ఈ ఘటన తీవ్రతను న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ హత్య కేసులో తాహిర్ హుస్సేన్, తోపాటు మరికొంతమంది ప్రమేయం ఉందని కోర్టులో రుజువు కావడంతో  జీవిత ఖైదు విధించింది కోర్టు. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల్లో అంకిత్ శర్మ అదృశ్యమై మురికి కాల్వలో శవమై తేలాడు. ఈ కేసు అప్పట్లో చర్చనీయాంశమైంది.