గుడ్ న్యూస్: పీఎం కిసాన్ మరో ఐదేళ్లు కొనసాగింపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

గుడ్ న్యూస్: పీఎం కిసాన్ మరో ఐదేళ్లు కొనసాగింపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

పీఎం మోదీ అధ్యక్షతన శుక్రవారం (జులై 31) కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా మొత్తం రూ.4 లక్షల 50 వేల 988 కోట్ల నిధుల విడుదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

పీఎం సూర్య సరోవర్ యోజన పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.  ఈ పథకం కొనసాగింపు కోసం  రూ.5 వేల 70 కోట్లు విడుదలకు ఆమోదించింది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కోసం రూ.3 లక్షల 15 వేల614 కోట్లు కేటాయింపుకు నిర్ణయం తీసుకున్నారు. 

ALSO READ : ఆయన త్యాగం మరువలేనిది.. మా మధ్య పుల్లలు పెట్టొద్దు

అదే విధంగా పీఎం కిసాన్‌ స్కీమ్‌ కొనసాగించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  2030-31 వరకు కొనసాగించనున్నారు.  ఖేలో ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్కీమ్‌ కోసం రూ.36,441 కోట్లు విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్ర మంథన్ కార్యక్రమానికి రూ.84 వేల 84 కోట్లు.. క్వీన్ ట్యూబ్ టన్నెల్స్ నిర్మాణం కోసం రూ.9 వేల 779 కోట్లు కేటాయింపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.