ఆయన త్యాగం మరువలేనిది.. మా మధ్య పుల్లలు పెట్టొద్దు: అభిజిత్ దీప్క్

ఆయన త్యాగం మరువలేనిది.. మా మధ్య పుల్లలు పెట్టొద్దు: అభిజిత్ దీప్క్

పర్యావరణకార్యకర్త  సోనమ్ వాంగ్  చుక్ తో విభేదాలున్నాయన్న ఊహాగానాలను కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే తోసిపుచ్చారు.  మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. ఇద్దరం ఏకాభిప్రాయంతో ఉన్నామని స్పష్టం చేశారు. 

విద్యాశాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఉద్యమాన్ని విరమించినప్పుడు వాంగు చుక్  పేరు ప్రస్తావించనందుకు ఇద్దరి మధ్య విభేదాలు న్నాయన్న క్వశ్చన్ తలెత్తిన క్రమంలో దీప్కే వాటిని తోసిపుచ్చారు. నేను, వాంగ్ చుక్ సర్ ఫోన్లో మాట్లాడుకున్నాం. మామధ్య ఎలాంటి విభేదాలు లేవు అని క్లారిటీ ఇచ్చారు. 

వాంగ్ చుక్ గురించి మాట్లాడుతూ.. ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ మర్చిపోలేం.. ప్రాణాలు పణంగా పెట్టి.. 26 రోజులు నిరాహార దీక్ష చేశారు. దేశాన్ని మేల్కొల్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఆయన వీధుల్లోకి వచ్చారు. వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేయకుంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేవాడే కాదని అని అన్నారు దీప్కే. వాంగుచుక్  ను దీక్ష విరమించాలని తాను వ్యక్తిగతంగా కోరినట్లు దీప్కే చెప్పారు. ఆయన దీక్ష విరమించిన తర్వాత తాను రిలాక్స్ అయ్యాయని అన్నారు .

Also Read ; ఎట్టకేలకు మౌనం వీడిన రాఘవ్ చద్దా

బీజేపీ నేతలు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ల సమక్షంలో వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమించడంతో దీప్క్ నిరాశ చెందారని వస్తున్న వార్తలను కూడా ఖండించారు. అలాంటిదేం లేదు.. అయితే వాంగ్  చుక్ కలిసేందుకు వారికి అనుమతిచ్చితనకు ఇవ్వకపోవడం బాధించిందని అన్నారు అభిజిత్ దీప్కే.