ఫేక్ నంబర్ ప్లేట్లు వాడితే..వాహనం సీజ్, క్రిమినల్ కేసు

 ఫేక్ నంబర్ ప్లేట్లు వాడితే..వాహనం సీజ్, క్రిమినల్ కేసు

హైదరాబాద్‌ సిటీలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, చలానాల నుంచి తప్పించుకునేందుకు నకిలీ నంబర్ ప్లేట్లు వాడే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా నగరంలో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది.

గత వారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నకిలీ నంబర్ ప్లేట్లకు సంబంధించి 6 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సుల్తాన్‌బజార్, మెహదీపట్నం, బహదూర్‌పురాతో పాటు పెద్దపల్లి, మేడిపల్లి, కట్టంగూర్ ప్రాంతాల్లోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

ప్రభుత్వం ఆమోదించిన హెచ్‌ఎస్‌ఆర్‌పీ (HSRP) నంబర్ ప్లేట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, స్టిక్కర్లు, డిజైన్లు లేదా అంకెలను మార్చివాడితే సహించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. జీరో టాలరెన్స్ విధానంతో ముందుకెళ్తున్నామని.. నకిలీ ప్లేట్లు వాడితే వాహనం సీజ్‌తో పాటు కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.