లాల్‌దర్వాజా బోనాలకు..2వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు

లాల్‌దర్వాజా బోనాలకు..2వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు

సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లాల్ దర్వాజ బోనాల జాతరకు  అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతర సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు  చేశారు. ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, జేబు దొంగతనాల నివారణకు షీ టీమ్స్,  24 గంటల క్రైం విభాగం నిఘా పెట్టారు. ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు. 

లాల్ దర్వాజ బోనాలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. బోనాల ఉత్సవాలకు 2వేలమంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాల ఉత్సవాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరిగేలా చూస్తామన్నారు సీపీ సజ్జనార్. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళీ ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణలో పాల్గొన్న  సజ్జనార్ భద్రతా ఏర్పాట్లను వివరించారు.