చాయా సోమేశ్వరాలయాన్ని యునెస్కో గుర్తించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

చాయా సోమేశ్వరాలయాన్ని యునెస్కో గుర్తించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ చాయా సోమేశ్వరాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పానగల్ లోని చారిత్రాత్మక పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పానగల్ లోని పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమన్నారు.