మేళ్ల చెరువు శివాలయంలో మంత్రి ఉత్తమ్ పూజలు

మేళ్ల చెరువు శివాలయంలో మంత్రి ఉత్తమ్ పూజలు
  • స్వామి వారి కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఉత్తమ్ 

మేళ్లచెరువు, వెలుగు: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని శివాలయాన్ని మహాశివరాత్రి రోజున సివిల్ సప్లై,ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారి కళ్యాణానికి మంత్రి పట్టువస్త్రాలు అందజేశారు. అక్కడే ఏర్పాటు చేసిన శివలింగానికి పంచామృత అభిషేకం జరిపిన అనంతరం మూలవిరాట్టు స్వయంభు శంభులింగేశ్వరున్ని దర్శించుకుని, తొలి అభిషేక పూజలో  పాల్గొన్నారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి,ఆశీర్వచనాలు అందజేశారు.

కార్యక్రమం లో ఉమ్మడి నల్గొండ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఈఓ శంభిరెడ్డి, చైర్మన్ లచ్చయ్య, జిల్లా ఓబీసీ  చైర్మన్ రామచందర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి,గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.