కీసర, వెలుగు: కీసర గుట్టకు ఫోర్లేన్ రోడ్డు నిర్మాణం కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం కీసర గుట్ట రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ఆలయాలను డెవలప్ చేస్తున్నామని, ఇందులో భాగంగా కీసర గుట్ట కమాన్ నుంచి కొండ వరకు రూ.50 కోట్లతో ఫోర్ లేన్ రోడ్డు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 10 రోజుల్లో టెండర్ పిలుస్తామని హామీ ఇచ్చారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి కీసర గుట్టను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఆలయ చైర్మన్ వెంకటేశ్ శర్మ, ఈవో సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
