OM First Strike glimpse: ధనుష్ 'OM' గ్లింప్స్‌పై 'పుష్ప' పోలికలు.. డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి క్రేజీ రియాక్షన్!

OM First Strike glimpse: ధనుష్ 'OM' గ్లింప్స్‌పై 'పుష్ప' పోలికలు.. డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి క్రేజీ రియాక్షన్!

తమిళ స్టార్ హీరో ధనుష్ 55వ చిత్రం (D55) నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ వచ్చేసింది. 'అమరన్' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి 'OM' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన  'OM First Strike' గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

'పుష్ప'తో పోలికలపై డైరెక్టర్ రియాక్షన్..

దట్టమైన అడవులు, ఎర్రచందనం దుంగలు, కొండల నడుమ సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ గ్లింప్స్ కట్ చేశారు. అమాయక గిరిజనులను సాయుధ బలగాలు చుట్టుముట్టగా, భయంతో వారంతా ఒక్కసారిగా 'అణ్ణా మలైయార్‌కు' అని నినదించే సీన్ థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఉంది. ఆ వెంటనే వర్షం, పొగమంచు మధ్య చేతిలో తుపాకితో ధనుష్ రగ్గడ్, వయలెంట్ అవతారంలో ఎంట్రీ ఇస్తాడు.

అయితే, ఈ గ్లింప్స్ చూసిన నెటిజన్లు అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పోలుస్తూ చర్చలు మొదలుపెట్టారు. దీనిపై డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి స్పందిస్తూ.. ఇది కేవలం ఒక చిన్న ఝలక్ మాత్రమే, సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. థియేటర్లలో చూశాక మీకే అర్థమవుతుంది. కేవలం చర్చ కోసమే ఈ గ్లింప్స్ వదిలాం అంటూ మరింత సస్పెన్స్ క్రియేట్ చేశారు.

క్రేజీ మల్టీ-పార్ట్ సిరీస్..

ఈ చిత్రాన్ని మేకర్స్ మల్టీ-పార్ట్ సిరీస్‌గా ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగాన్ని 'Chapter 1: Udhiram – The Blood Wood'పేరుతో తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్‌తో పాటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుందనే టాక్ ఉంది. గ్లామర్ డాల్ శ్రీలీల మరో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఫస్ట్ స్ట్రైక్‌లో కేవలం ధనుష్ యాక్షన్ మాత్రమే చూపించి, మమ్ముట్టి, సాయి పల్లవి లుక్స్‌ను సస్పెన్స్‌గా ఉంచారు మేకర్స్. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు నెక్స్ట్ లెవెల్ హైప్ తెచ్చింది. వండర్‌బార్ ఫిలింస్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 అక్టోబర్ 16న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది..