అమెరికా అందాలు చూడాలని వెళ్లిన ఒక కుటుంబం ఆనందం నిమిషాల్లోనే విషాదంగా మారింది. తల్లిదండ్రులతో న్యూయార్క్ వెళ్లిన యువకుడు.. తల్లిని కాపాడబోయి చనిపోయిన ఘటన.. ఆ పేరెంట్స్ కు కడుపుకోతను మిగిల్చింది. ఇండియాలో యూనివర్సిటీలో సీటు వచ్చిందని తెలిసిన ఒక రోజులోనే యువకుడి కెరీర్ ఎండ్ కావడం కలచి వేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో అదుపు తప్పిన గుర్రపు బండి నుంచి దూకిన యువకుడు చనిపోయిన వీడియో వెలుగులోకి వచ్చింది. కుటుంబంతో కలిసి తొలిసారి న్యూయార్క్‌కు వచ్చిన రొమాంచ్ మహాజన్ (18).. బండి నుంచి కింద పడిపోయిన తల్లిని కాపాడేందుకు కిందికి దూకి చనిపోయాడు. బండి నడిపేవాడు లేకపోవడం గుర్రాన్ని అదుపుచేయడం కష్టంగా మారిన పరిస్థితుల్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
గుర్రపు బండి ఎక్కిన ఫ్యామిలీ సరదాగా ఫోటో తీసుకోవాలనుకుంది. రౌతు ఫోటో తీయడానికి కిందకు దిగగానే గుర్రం బెదిరి పరుగెత్తిన వీడియో వైరల్ గా మారింది. అదుపు లేకుండా పరిగెత్తిన గుర్రం.. ఒక మలుపు తిరిగిన తర్వాత ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. దాని వెనుక బండి నడిపే వ్యక్తి కూడా పరుగెత్తినా లాభం లేకుండా పోయింది. ఆ సమయంలో రోమాంచ్, అతని తల్లిదండ్రులు, తమ్ముడు బండిలోనే ఉన్నారు.
ఆరు సెకన్ల ఆ క్లిప్‌లో, బండి నుంచి ఇద్దరు కింద పడిపోవడం చూడవచ్చు. శాంప్సన్ అనే ఏడేళ్ల గుర్రం కేవలం ఆరు వారాల క్రితమే పనిలోకి ఎక్కిందట. ఫోటోలు తీస్తుండగా బెదిరి ఒక్కసారిగా పరుగు లంకించింది. రొమాంచ్ ఫ్యామిలీ మెంబర్స్ స్వల్ప గాయాలతో బయటపడగా, రోమాంచ్ మాత్రం తల నేలకు కొట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కొన్ని గంటల తర్వాత చనిపోయాడు.
అమ్మా అని అరిచాడు నా కొడుకు..
ఫౌంటైన్ దగ్గర ఫ్యామిలీ ఫోటో తీయడానికి రౌతు కిందకు దిగినప్పుడు గుర్రం అకస్మాత్తుగా బెదిరిందని రోమాంచ్ తండ్రి దీపక్ మహాజన్ చెప్పారు. రోమాంచ్ తల్లి బండిలోంచి కింద పడిపోగా, ఆమెను కాపాడే ప్రయత్నంలో బయటకు దూకాడని తెలిపాడు. నన్ను కాపాడండి, కాపాడండి అని మేము అరుస్తున్నాము.. ఆ సమయంలో నా భార్య కింద పడిపోయింది. ఆమెను కాపాడటానికి రొమాంచ్ కిందకు దూకాడని అతను చెప్పాడు. తలకు బలంగా దెబ్బతగిలింది. ఆ సమయంలో అమ్మా.. అని అరిచాడు నాకొడుకు అంటూ కన్నీల్లు పెట్టుకున్నాడు.
నా కొడుకుకు జైపూర్ యూనివర్సిటీలో సీటు వచ్చింది. కానీ వాడి కల కళ్లగాన మిగిలిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా నుంచి టూర్ కు న్యూయార్క్ వచ్చిన రోజే జైపూర్‌లోని యూనివర్సిటీలో సీటు వచ్చిందని.. ఆ ఆనందం కొద్ది గంటలు కూడా మిగలలేదని భావోద్వేగానికి గురయ్యారు.
150 ఏళ్ల తర్వాత తొలి ప్రమాదం..
న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బగ్గీలను ప్రవేశపెట్టిన 150 ఏళ్లుగా ఇలాంటి ప్రమాదం జరగలేదని పార్క్ సిబ్బంది పేర్కొన్నారు. బగ్గీ బండి ప్రమాదంలో మరణించిన తొలి వ్యక్తి రొమాంచ్ మహాజన్ అని బగ్గీ డ్రైవర్ల యూనియన్ తెలిపింది. ఫోటోలు తీయడానికి డ్రైవర్ ఎప్పుడూ బండి దిగకూడదని ఈ సందర్భంగా చెప్పారు.
ఈ ఘటనపై భారత సంతతి నేత, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బగ్గీని నిషేదిస్తామని.. అదే సమయంలో బగ్గీ కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలను తీసుకొస్తామని తెలిపారు.
Here’s a video of the horse breaking free and the carriage driver chasing after it.
— Gus Saltonstall (@GusSaltonstall) June 17, 2026
A person comes jumping/falling out of the carriage at the end of the clip. pic.twitter.com/BZmEOXqhxC
